రామ్ చరణ్ సినిమా కోసం ఆలు అర్జున్

Thursday,April 27,2017 - 10:00 by Z_CLU

రామ్ చరణ్ ఆల్ రెడీ సుకుమార్ సినిమాతో సెట్స్ పై ఉన్నాడు. ఈ లోపు చెర్రీ సినిమాకి అల్లు అర్జున్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడనే టాక్ ఒక్కసారిగా టాలీవుడ్ లో హీట్ ని జెనెరేట్ చేస్తుంది. అంటే సుక్కు సినిమాలో బన్ని వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడా..? ముమ్మాటికీ కాదు. హాట్ టాపిక్ గా మారిన ఈ టాక్ సుకుమార్ రామ్ చరణ్ సినిమా గురించి కాదు. కన్నడ బ్లాక్ బస్టర్ ‘బహదూర్’ సినిమా గురించి.

ఇప్పటి వరకు ఈ సినిమా గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే బయటికి రాలేదు కానీ కన్నడ ‘బహదూర్’ ని  తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ధృవ సర్జా హీరోగా నటించిన ఈ సినిమా  తెలుగు రీమేక్ లో రామ్ చరణ్ నటిస్తున్నాడనే టాక్ చిన్న సైజు వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తుంది. కన్నడలో ఈ సినిమాకి పునీత్ రాజ్ కుమార్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇప్పుడీ తెలుగు వర్షన్ కి బన్ని వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు.

ఈ సినిమాని అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించే ఆలోచనలో ఉన్నాడన్న టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తున్నా, అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే కానీ, ఈ విషయంలో క్లారిటీ రాదు.