హాట్ గాసిప్.. పుష్పలో స్పెషల్ ఫైట్

Sunday,September 20,2020 - 12:37 by Z_CLU

ఇది అలాంటిలాంటి గాసిప్ కాదు. మెగా ఫ్యాన్స్ అంతా పండగ చేసుకునే గాసిప్. అవును.. పుష్ప సినిమాలో అదిరిపోయే ఫైట్ ఉందట. ఫైట్స్ ప్రతి సినిమాలో ఉంటాయి. పుష్పలో స్పెషాలిటి ఏంటి..? అక్కడికే వస్తున్నాం.

పుష్ప సినిమాలో బన్నీపై పులి ఫైట్ ప్లాన్ చేస్తున్నారట. బన్నీ-పులి మధ్య వచ్చే ఈ ఫైట్ టోటల్ సినిమాకే హైలెట్ అంటున్నారు.

ఈమధ్య వచ్చిన మన్యంపులి సినిమాతో పాటు చాలా సినిమాల్లో పులి ఫైట్స్ ను గ్రాఫిక్స్ లో చూపించారు. అయితే పుష్పలో మాత్రం గ్రాఫిక్ ఫైట్ ఉండదట. నిజమైన పులితోనే ఫైట్ పిక్చరైజ్ చేస్తారట.

ఇండియాలో ఇలాంటి ఫైట్స్ తీయడానికి కుదరదు కాబట్టి, ఈ ప్రత్యేకమైన యాక్షన్ సీక్వెన్స్ కోసం వియత్నాం వెళ్లి, అక్కడ పులితో షూటింగ్ చేయాలని అనుకుంటోందట యూనిట్.

ఎర్రచందనం స్మగ్లింగ్ కాన్సెప్ట్ తో శేషాచలం అడవుల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వస్తోంది కాబట్టి.. పులిఫైట్ గాసిప్ కాస్త నమ్మేలానే ఉంది.