మరో పోస్టర్ తో DJ హంగామా

Monday,May 08,2017 - 04:30 by Z_CLU

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘దువ్వాడ జగన్నాథం’ సోషల్ మీడియాలో హంగామా చేస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది.. హరీష్ శంకర్ దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాణం లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మూడు పోస్టర్స్ రిలీజ్ చేసి సినిమా పై భారీ అంచనాలు పెంచిన మేకర్స్ లేటెస్ట్ గా మరో పోస్టర్ ను సోషల్ మీడియా లో రిలీజ్ చేశారు..


మొదటి పోస్టర్ లో బ్రాహ్మణ గెటప్ లో అదరగొట్టేసిన బన్నీ ఆ తరువాత రిలీజ్ చేసిన పోస్టర్ లో వైలైంట్ గా కనిపించి ఆకట్టుకొని సినిమా పై భారీ అంచనాలు నెలకొల్పాడు…. ఇక లేటెస్ట్ గా రిలీజ్ చేసిన మరో పోస్టర్ లో స్టైలిష్ లుక్ లో సూపర్బ్ అనిపించుకున్న అల్లు అర్జున్ ఈరోజు రిలీజ్ చేసిన పోస్టర్ లో రొమాంటిక్ గా కనిపిస్తూ మెస్మరైజ్ చేశాడు.. పూజా హెగ్డే తో కలిసి ఓ రొమాంటిక్ సాంగ్ లో వచ్చే ఈ స్టిల్ ప్రెజెంట్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారి ట్రెండ్ అవుతుంది. ప్రెజెంట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఆడియోను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్…