విజయ్ దేవరకొండ నిర్మాతకు బన్నీ కంగ్రాట్స్

Sunday,October 04,2020 - 10:02 by Z_CLU

యంగ్ ప్రొడ్యూసర్ కేదార్ సెలగంశెట్టి తన తొలి సినిమా నిర్మిస్తూ ఫిల్మ్
ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న సందర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్
అభినందనలు తెలియజేశారు. కేదార్ సెలగంశెట్టి అల్లు అర్జున్ మంచి
స్నేహితులు. తన స్నేహితుడిని ఇండస్ట్రీకి సాదరంగా ఆహ్వానించారు అల్లు అర్జున్.

ఇటీవలే స్టార్ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు సుకుమార్ తో ఈ యువ నిర్మాత తన ఫాల్కన్ క్రియేషన్స్ సంస్థలో తొలి సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ సినిమా అనౌన్స్ మెంట్ రోజు మొక్కను బహుమతిగా  పంపారు అల్లు అర్జున్. తాజాగా కలిసి పర్సనల్ గా విషెస్ తెలిపారు.