అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్

Wednesday,April 08,2020 - 10:38 by Z_CLU

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు తన బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. టాలీవుడ్ ప్రముఖులంతా బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. జీ సినిమాలు కూడా స్టయిలిష్ స్టార్ కు బర్త్ డే విశెష్ అందిస్తోంది. ఈ సందర్భంగా బన్నీ కెరీర్ లో హై-పాయింట్స్ చూద్దాం.

 

బన్నీ చేసిన అల వైకుంఠపురములో సినిమా ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు బన్నీ. ఈ మూవీ కోసం మేకోవర్ అయ్యే పనిలో బిజీగా ఉన్నాడు ఈ స్టయిలిష్ స్టార్.

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా అంతా ఇళ్లకే పరిమితమైన వేళ.. అల్లు అర్జున్ కూడా తన బర్త్ డే సెలబ్రేషన్స్ ను ఇంటికే పరిమితం చేశాడు. భార్య, కొడుకు, కూతురితో కలిసి కేక్ కట్ చేశాడు. లాక్ డౌన్ కనుక లేకపోతే ఈపాటికి గీతా ఆఫీస్ లో ఫుల్ సందడి కనిపించేది.