బన్నీ ప్రత్యేక అతిథిగా టాక్సీవాలా ప్రీ-రిలీజ్ ?

Thursday,November 08,2018 - 12:31 by Z_CLU

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ టాక్సీవాలా. ఈనెల 17న గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది. ఈ గ్యాప్ లో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చేయాలని ఫిక్స్ అయ్యారు. మరో 3 రోజుల్లో (నవంబర్ 11) టాక్సీవాలా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను సెలబ్రేట్ చేయబోతున్నారు.

ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్ గా వచ్చే ఛాన్స్ ఉంది. గతంలో విజయ్ దేవరకొండ నటించిన గీతగోవిందం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు కూడా బన్నీ స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సెంటిమెంట్ తో టాక్సీవాలాకు కూడా బన్నీని ఆహ్వానించారు.

హైదరాబాద్ JRC కన్వెన్షన్ సెంటర్ లో టాక్సీవాలా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరగనుంది. ఈ వేడుకను జీ సినిమాలు, జీ సినిమాలు హెచ్ డీ ఛానెల్స్ లో లైవ్ లో చూడొచ్చు. జీ సినిమాలు యూట్యూబ్, వెబ్ సైట్ లో కూడా టాక్సీవాలా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లైవ్ కవరేజ్ ఉంటుంది.