Varudu Kaavalenu - ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో బన్నీ
Wednesday,October 27,2021 - 01:20 by Z_CLU
Allu Arjun as Chief Guest for Varudu Kaavalenu Pre Release function
వరుడు కావలెను సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈరోజు సాయంత్రం శిల్పకళావేదికలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరగనుంది. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ వేడుకకు స్పెషల్ గెస్ట్ గా ఎటెండ్ అవుతున్నాడు.
ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను జీ సినిమాలు ఛానెల్ లో ఎక్స్ క్లూజివ్ గా చూసి ఎంజాయ్ చేయండి. ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి జీ సినిమాలు ఛానెల్ లో వరుడు కావలెను ప్రీ-రిలీజ్ ఫంక్షన్ టెలికాస్ట్ అవుతుంది. జీ తెలుగు, జీ సినిమాలు యూట్యూబ్ ఛానెల్స్ లో కూడా లైవ్ స్ట్రీమింగ్ ఉంది.

నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం ‘వరుడు కావలెను’. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రమిది. ఈ నెల 29న థియేటర్‌లలో విడుదల కానుంది.

సినిమా ప్రమోషన్‌ను మేకర్స్ వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. దానికి హీరో దగ్గుబాటి రానా ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. శనివారం సంగీత్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే హాజరైంది. ఇప్పుడు ఇదే ఊపులో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. దీనికి ఏకంగా అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు.
ఈ సినిమాలో ఆకాష్ గా శౌర్య, భూమిగా రీతూ వర్మ నటించారు. ఇద్దరి పాత్రలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. అంతా అనుకుంటున్నట్టు ఇదేదో రొటీన్ లవ్ స్టోరీ, లేక పెళ్లి బ్యాక్ డ్రాప్ లో నడిచే ఫ్యామిలీ సినిమా మాత్రమే కాదు.. అంతకుమించి ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలున్నాయని అంటున్నారు డైరక్టర్ లక్ష్మీ సౌజన్య.
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics