అల్లు అర్జున్ ఏప్రిల్ సెంటిమెంట్

Thursday,August 03,2017 - 06:06 by Z_CLU

అల్లు అర్జున్  ఏప్రిల్ సెంటిమెంట్ ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. బన్నీ సినిమాతో బిగిన్ అయితే రేసు గుర్రం, S/O సత్యమూర్తి, సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్స్ ఏప్రియల్ లోనే రిలీజ్ అయ్యాయి. అందుకే ఆ సెంటిమెంట్ మైండ్ లో పెట్టుకునే ఇప్పుడు ‘నా పేరు సూర్య’ రిలీజ్ కి కూడా ఏప్రిల్ నే ప్రిఫర్ చేసినట్టున్నాడు బన్ని.

వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ హై ఎండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ నిన్నటి నుండే బిగిన్ అయింది. యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాని ఏప్రిల్ 27 న రిలీజ్ చేయాలనుకుంటుంది సినిమా యూనిట్.

అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి విశాల్ శేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. లగడపాటి శ్రీధర్ నిర్మాత.