అల్లు అరవింద్ నిర్మాతగా రామాయణం

Wednesday,May 10,2017 - 04:21 by Z_CLU

ఇతిహాసాలు, పురాణాల్ని వెండితెరపైకి తీసుకురావడం మామూలు విషయం కాదు. దానికి ఎంతో ఖర్చు అవుతుంది. పైగా ఎంతో ఓపిక, మరెంతో అంకితభావం కావాలి. అలాంటి సాహసాన్నే చేయడానికి రెడీ అవుతున్నారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. త్వరలోనే రామాయణానికి వెండితెర దృశ్యరూపం ఇవ్వాలనుకుంటున్నారట అరవింద్.

రామాయణాన్ని ఇప్పటికే పలువురు దర్శకులు వెండితెరపైకి తీసుకొచ్చారు. ఎంత మంది ఎన్ని రకాలుగా చూపించినా రామాయణంలో ఏదో ఒక కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది. అందుకే అల్లు అరవింద్ భారీస్థాయిలో రామాయణాన్ని తీసుకురావాలని అనుకుంటున్నారట. తెలుగు-తమిళ-హిందీ భాషల్లో 3 భాగాలుగా రామాయణాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నారట.

అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి, హై-ఎండ్ గ్రాఫిక్స్ తో త్రీడీలో రామాయణాన్ని తెరకెక్కించాలనేది అరవింద్ ప్లాన్. ప్రస్తుతానికి దీనికి 5వందల కోట్ల రూపాయల బడ్జెట్ అనుకుంటున్నారు. అల్లు అరవింద్ తో పాటు ప్రైమ్ ఫోకస్ అధినేత నమిత్ మల్హోత్రా, మధు మంతెన నిర్మాతలుగా రామాయణం రాబోతోందని సమాచారం.