మహేష్ తో సినిమా ప్లాన్ చేస్తున్న బడా నిర్మాత

Sunday,September 02,2018 - 12:03 by Z_CLU

సొంత బ్యానర్ ‘గీతా ఆర్ట్స్’ లో బడా సినిమాలు నిర్మిస్తున్న అల్లు అరవింద్ ఇటివలే ‘గీతా ఆర్ట్స్ 2’ అనే బ్యానర్ ని కూడా స్థాపించి బన్నీ వాస్ నిర్వాహణలో కొన్ని చిన్న సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ‘సరైనోడు’ తర్వాత పెద్ద సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న అల్లు అరవింద్ ప్రస్తుతం స్టార్ హీరోలతో బడా సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నాడట.

ఇందులో భాగంగా ముందుగా మహేష్ బాబుతో ఓ భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అర్జున్ రెడ్డి తో సెన్సేషనల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ , మహేష్ కాంబినేషన్ లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట అల్లు అరవింద్.

అయితే ఈ సినిమా ఎప్పుడు ఉంటుందనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు కానీ సినిమా మాత్రం పక్కా అనే టాక్ వినిపిస్తుంది. మరి ఏస్ ప్రొడ్యూసర్ మహేష్ తో మొదలుపెట్టి ప్రస్తుత స్టార్ హీరోలను ఎంత మందిని కవర్ చేస్తారో చూడాలి..