అల్లరి నరేష్ కొత్త సినిమా షూటింగ్ అప్ డేట్స్

Saturday,June 30,2018 - 05:29 by Z_CLU

అల్లరి నరేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. లేటెస్ట్ గా అంతర్వేదిలో ఓ షెడ్యూల్ ఫినిష్ చేసిన త్వరలోనే హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ‘ఎ టీవి’ సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘నందిని నర్సింగ్ హోమ్’ ఫేం పి.వి.గిరి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఏకే ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ పై కామెడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో  అల్లరి నరేష్ సరసన పూజ జావేరి హీరోయిన్ గా నటిస్తుంది.   సెప్టెంబర్ లో సినిమాను  విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.