కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలో అల్లరోడు

Tuesday,November 12,2019 - 02:45 by Z_CLU

రీసెంట్ గా మహర్షిలో మంచి పాత్ర పోషించాడు అల్లరి నరేష్. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో తన కెరీర్ ను డిఫరెంట్ పాథ్ లోకి తీసుకెళ్లబోతున్నాడు. ఇందులో భాగంగా ఓ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాకు ఓకే చెప్పాడు ఈ హీరో. విజయ్ కనకమేడల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. గతంలో ఇతడు హరీష్ శంకర్ దగ్గర వర్క్ చేశాడు

ప్రస్తుతం బంగారు బుల్లోడు అనే సినిమా చేస్తున్నాడు అల్లరినరేష్. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇది పూర్తయిన వెంటనే ఈ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం తెలుగులో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఖైదీనే దీనికి పెర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్. మంచి కథల కోసం చూస్తున్న అల్లరినరేష్.. వెంటనే ఈ స్టోరీకి ఓకే చెప్పడానికి ఇది కూడా ఓ కారణం.

`మోస‌గాళ్ల‌కు మోస‌గాడు`, `ఒక్క క్ష‌ణం` చిత్రాల‌కు కో ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన స‌తీశ్ వేగేశ్న నిర్మాత‌గా మారి ఎస్‌వీ2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్నినిర్మించ‌బోతున్నారు. హీరోయిన్ తో పాటు టెక్నీషియన్స్ వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తారు.