'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ఫస్ట్ లుక్

Tuesday,May 10,2022 - 01:21 by Z_CLU

Allari Naresh’s ‘ItluMaredumilliPrajaneekam’ first look Released

కామెడీ స్టార్ అల్ల‌రి నరేష్‌ రూటు మార్చి సీరియస్ సినిమాలు చేస్తూ నటుడిగా ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే.  అల్లరి నరేష్ సీరియస్ సబ్జెక్ట్ తో  న‌టిస్తోన్న అప్ కమింగ్ మూవీ  ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. అల్లరి నరేష్ 59వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎ.ఆర్‌.మోహ‌న్ దర్శకత్వం వహిస్తుండగా జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో హాస్య మూవీస్ బేనర్ పై రాజేష్ దండు నిర్మిస్తున్నారు.

‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌’, ‘రిప‌బ్లిక్‌’, ‘బంగార్రాజు’ వంటి వ‌రుస స‌క్సెస్‌ఫుల్ మూవీస్‌ను అందించిన ప్రముఖ నిర్మాణ జీ స్టూడియోస్ సమర్పణలో  తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన ఆనంది హీరోయిన్‌గా నటిస్తుంది.

హీరో నరేష్ ఇండస్ట్రీలో ఇరవై ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను యూనిట్ విడుద‌ల చేసింది. పోస్టర్ గ‌మ‌నిస్తే.. నరేష్ మంచం కోడు పట్టుకుని ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నాడు. ఆ మంచం మీద ఎవరున్నారు ? అనేది చూపించకుండా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. తలకు, చేతికి గాయాలతో నరేష్ ఇన్‌టెన్స్ లుక్‌తో కనిపిస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే థియేటర్స్ లోకి రాబోతుంది.

వెన్నెల కిషోర్‌, ప్ర‌వీణ్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అబ్బూరి ర‌వి ఈ చిత్రానికి మాట‌ల‌ను అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీ చ‌ర‌ణ్ పాకాల సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌. ఛోటా కె.ప్ర‌సాద్ ఎడిట‌ర్‌. బ్ర‌హ్మ క‌డ‌లి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా, యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌గా పృథ్వి వ‌ర్క్ చేస్తున్నారు.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics