Allari Naresh ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం రిలీజ్ డేట్
Thursday,September 29,2022 - 12:30 by Z_CLU
సాధారణంగా అల్లరి నరేష్ అంటే కామెడీ చిత్రాలే కాదు.. విశాఖ ఎక్స్‌ప్రెస్, గమ్యం, నాంది వంటి వైవిధ్యమైన కథాంశాలున్న చిత్రాల్లోనూ నటించి నటుడిగా మెప్పించారాయన. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. సోలో బ్రతుకే సో బెటర్, రిపబ్లిక్, బంగార్రాజు వంటి వరుస సక్సెస్‌ఫుల్ మూవీస్‌ను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణ, నిర్మాణంలో, మరో నిర్మాణ హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఎ.ఆర్.మోహన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి రాజేష్ దండ నిర్మాత. బాలాజీ గుత్త సహ నిర్మాత. ఆనంది హీరోయిన్‌గా నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. నవంబర్ 11న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అల్లరి నరేష్ తన తోటి ఉద్యోగులతో అలాగే పోలీసులతో కలిసి గిరిజన గ్రామంలో నడుస్తూ వస్తున్న పోస్టర్ తో రిలీజ్ డేట్ ప్రకటించారు. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ తో రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే టీజర్ సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పింది. నాంది సినిమా తర్వాత అల్లరి నరేష్ నుండి వస్తున్న ఈ విభిన్న కథా చిత్రం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.