Itlu Maredumilli Prajaneekam రేపే గ్రాండ్ రిలీజ్

Thursday,November 24,2022 - 01:44 by Z_CLU

Allari Naresh’s ‘Itlu Maredumilli Prajaneekam’ Grand Release tomorrow

‘నాంది’ సినిమాతో హీరోగా మంచి విజయం అందుకున్న అల్లరి నరేష్ (Allari Naresh) మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల రాబోతున్నాడు. AR మోహన్  దర్శకత్వంలో హాస్య మూవీస్ తో కలిసి జీ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా రేపే గ్రాండ్ గా రిలీజవుతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ , సాంగ్స్ సినిమా విభిన్నంగా ఉండబోతుందనే హింట్ ఇచ్చి సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.

ఈ సినిమాలో అల్లరి నరేష్ నటన అద్భుతంగా ఉంటుందని , నరేష్ లో మరో యాంగిల్ చూపించే సినిమా అవుతుందని యూనిట్ చెప్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ ను దర్శకుడు బాగా డిజైన్ చేశారనే టాక్ వినబడుతుంది. వెన్నెల కిషోర్ , ప్రవీణ్ కామెడీ అలరిస్తుందని , అలాగే అబ్బూరి రవి మాటలు , శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్ కానున్నాయని తెలుస్తుంది.

ఓవరాల్ గా ప్రీ రిలీజ్ కంటెంట్ తో ఎట్రాక్ట్ చేసిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం (Itlu Maredumilli Prajaneekam Movie) సినిమాతో అల్లరి నరేష్ మరో సూపర్ హిట్ అందుకోవడం ఖాయమనిపిస్తుంది. మరి నరేష్ ఎంచుకున్న ఈ డిఫరెంట్ మూవీ రేపు ఆడియన్స్ ఎన్ని ఓట్లు వేస్తారో సినిమా ఏ స్థాయి సక్సెస్ అవుతుందో చూడాలి.

అల్లరి నరేష్ సరసన అనండి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్ , ప్రవీణ్ , సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా భారీ థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.

 

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics