ఈ వీకెండ్ అల్లరోడి సినిమా సందడి

Saturday,May 02,2020 - 04:30 by Z_CLU

కామెడీకి కేరాఫ్ అడ్రస్ అల్లరినరేష్. ఈ లాక్ డౌన్ టైమ్ లో అలాంటి హీరో సినిమాలు చూస్తూ ఇంట్లో హ్యాపీగా టైమ్ గడిపే ఛాన్స్ వచ్చింది. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు అల్లరి నరేష్ సినిమాల్ని బ్యాక్ టు బ్యాక్ ప్రసారం చేస్తోంది మీ జీ సినిమాలు.

ఉదయం 6గం.30 నిమిషాలకు.. సిద్ధూ ఫ్రం సికాకుళం
అల్లరి నరేష్, మంజరి ఫడ్నిస్ హీరోహీరోయిన్లుగా నటించిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమా పర్ ఫెక్ట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్. ప్రాణం కన్నా ప్రేమే గొప్పది అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. దీన్ని కామెడీ యాంగిల్ లో చెప్పారు. అల్లరోడి కామెడీతో పాటు ఎమ్మెస్ నారాయణ, ఆహుతి ప్రసాద్ కామెడీ ఈ సినిమాకు హైలెట్స్. శ్రద్ధాదాస్ అందాలు బోనస్.

ఉదయం 9గంటలకు అహనా పెళ్లంట
రియల్ స్టార్ శ్రీహరి, నరేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ అహ నా పెళ్ళంట. వీరభద్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు అన్ని సెంటర్లలో నవ్వులు పూయించింది. అమాయకంగా కనిపిస్తూనే అల్లరోడు ఇందులో కామెడీ పంచిన విధానం సూపర్. బ్రహ్మానందం పంచ్ లు, ఎక్స్ ప్రెషన్స్ బోనస్.

మధ్యాహ్నం 12 గంటలకు బ్రదర్ ఆఫ్ బొమ్మాలి
కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా… కార్తీక, మోనాల్ గజ్జర్ హీరోయిన్లుగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమాలో అల్లరోడి అక్కగా కార్తీక యాక్టింగ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. కోన వెంకట్ గా బ్రహ్మానందం కామెడీ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అల్లరి నరేష్ ఎనర్జీ తో కూడిన ఫన్నీ పెర్ఫార్మెన్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్, కామెడీ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.

మధ్యాహ్నం 3 గంటలకు సుడిగాడు
అల్లరినరేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా సుడిగాడు. ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు అన్ని సూపర్ హిట్ సినిమాల స్పూఫ్స్ తో తెరకెక్కిన సుడిగాడు.. బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లరోడి గెటప్స్, అతడి మేనరిజమ్స్, పండించిన కామెడీ అదుర్స్. దీనికితోడు బ్రహ్మానందం, ఎల్బీశ్రీరామ్, ఎమ్మెస్ నారాయణ, కొండవలస కామెడీ ఎక్స్ ట్రా బోనస్.

సాయంత్రం 6 గంటలకు బెండు అప్పారావు
ఇక అల్లరోడి కెరీర్ లో మరో సూపర్ హిట్ మూవీ బెండు అప్పారావు. RMP డాక్టర్ గా అల్లరి నరేష్ పండించిన కామెడీ ఎన్నిసార్లు చూసినా నవ్వు తెప్పిస్తుంది. R.M.P. గా పని చేస్తుంటాడు బెండు అప్పారావు. నిజానికి తనకు వైద్యం చేసే పద్ధతి తెలీకపోయినా, చిన్నా చితకా ట్రిక్స్ వాడి ఊరి జనానికి వైద్యం చేస్తుంటాడు. దానికి తోడు తన అక్క కాపురాన్ని ఎలాగైనా నిలబెట్టాలని తాపత్రయపడుతుంటాడు. బెండు అప్పారావు బావ, ఎప్పుడు చూసినా తన అక్కని కట్నం కోసం వేదిస్తూనే ఉంటాడు. అంతలో ఊరిలో జరిగిన ఒక సంఘటన అప్పారావు జీవితాన్ని ఇంకో మలుపు తిప్పుతుంది. ఏంటది..? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. తండ్రి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో అల్లరోడు చేసిన ఈ సినిమా అతడి కెరీర్ లో వెరీ వెరీ స్పెషల్ మూవీ.

రాత్రి 9 గంటలకు యాక్షన్ 3D
అల్లరినరేష్ కెరీర్ లో మరో డిఫరెంట్ కామెడీ డ్రామా యాక్షన్ త్రీడీ. అల్లరినరేష్-స్నేహా ఉల్లాల్ జంటగా నటించిన ఈ సినిమా ఓ కొత్తరకం వినోదాన్ని పంచుకుంది. అల్లరినరేష్ తో పాటు వైభవ్, రాజుసుందరం, శ్యామ్ చేసిన హంగామా చూసి తీరాల్సిందే.

ఈ ఆదివారాన్ని అల్లరోడి కామెడీ చిత్రాలతో ఎంజాయ్ చేయండి.