ఇట్స్ అఫీషియల్: మహేష్ సినిమాలో అల్లరోడు

Tuesday,May 29,2018 - 01:44 by Z_CLU

మహేష్ బాబు సినిమాలో అల్లరినరేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడట. మొన్నటివరకు ఇది రూమర్ మాత్రమే. కానీ ఈరోజు నుంచి ఇది అఫీషియల్. అవును.. మహేష్ నటించబోతున్న ప్రతిష్టాత్మక 25వ చిత్రంలో నటించడానికి అల్లరి నరేష్ ఒప్పుకున్నాడు. ఈరోజు అగ్రిమెంట్ పై సంతకం చేశాడు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ తర్వాత అంతటి కీలకమైన పాత్ర అల్లరి నరేష్ దేనట. సినిమాలో మహేష్ కు ఫ్రెండ్ గా అల్లరినరేష్ కనిపించబోతున్నాడు. ఇన్నాళ్లూ కామెడీ హీరో పాత్రలు పోషించిన అల్లరినరేష్.. మహేష్ 25వ చిత్రంలో కూడా కాస్త కామిక్ టచ్ తోనే కనిపిస్తాడట. కాకపోతే క్లయిమాక్స్ కు వచ్చేసరికి అల్లరినరేష్ క్యారెక్టరే హైలెట్ అవుతుందట. అల్లరోడు ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం కూడా ఇదేనని టాక్.

జూన్ సెకెండ్ వీక్ నుంచి మహేష్ బాబు సినిమా సెట్స్ పైకి వస్తుంది. జులై నుంచి అల్లరి నరేష్ ఈ సినిమాలో జాయిన్ అవ్వబోతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు. దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు.