టీజర్ తో 'మేడ మీద అబ్బాయి' రెడీ

Tuesday,July 25,2017 - 01:02 by Z_CLU

అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ ‘మేడమీద అబ్బాయి’. జాహ్నవి ఫిల్మ్స్ బ్యానర్ పై బొప్పన చంద్రశేఖర్ నిర్మాతగా జి.ప్రజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. అల్లరి నరేష్ సరసన నిఖిల విమల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాతో థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు అల్లరి నరేష్. ఈ సినిమాకు షాన్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ ఫినిషింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమా పాటలను ఆగస్టు ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేసి, ఆగస్టు చివరి వారంలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.