అల్లరోడు రెడీ....

Monday,December 12,2016 - 07:00 by Z_CLU

అల్లరి నరేష్ హీరోగా జి.నాగేశ్వర రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ‘ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం’ రిలీజ్ కి రెడీ అవుతుంది. నోట్ల రద్దు తో రిలీజ్ వరకూ వచ్చి పోస్ట్ ఫోన్ అయిన ఫస్ట్ సినిమా ఇదే. అదే టైం లో నాగ చైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’ రిలీజ్ కాగా ఆ నెక్స్ట్ నిఖిల్ ‘ఎక్కడికి పోతావు చిన్న వాడా’ రిలీజ్ అయ్యాయి. ఆ తరువాత వరుసగా కొన్ని సినిమాలు థియేటర్స్ లో సందడి చేయగా అల్లరోడు మాత్రం ఆ టైం లో థియేటర్స్ లోకొచ్చే సాహసం చేయలేదు.

లేటెస్ట్ గా ఈ సినిమా తో డిసెంబర్ 30 న ఎట్టకేలకి రాబోతున్నాడు అల్లరి నరేష్.  సంక్రాంతి కానుకగా జనవరి లో బడా సినిమాలు థియేటర్స్ లోకి ఎంటరవుతుండడం తో ఇక ఇదే కరెక్ట్ టైం అనుకోని ధైర్యంగా థియేటర్స్ కు రాబోతున్నాడు. మరి ఈ హారర్ కామెడీ తో అల్లరోడు ఎలాంటి హిట్ సాధిస్తాడా? చూడాలి.