Allari Naresh New movie titled as Itlu Maredumilli Prajaneekam
కామెడీ చిత్రాలతో కడుపుబ్బా నవ్వించే నేటి తరం కామెడీ స్టార్ అల్లరి నరేష్. కామెడీ చిత్రాలే కాదు.. విశాఖ ఎక్స్‌ప్రెస్, గమ్యం, నాంది వంటి వైవిధ్యమైన చిత్రాల్లోనూ నటించి నటుడిగా మెప్పించారాయన. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న 59వ చిత్రం టైటిల్‌ను ప్రకటించారు. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనేది ఆ సినిమా టైటిల్.
సోలో బ్రతుకే సో బెటర్, రిపబ్లిక్, బంగార్రాజు వంటి వరుస సక్సెస్ఫుల్ మూవీస్‌ను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణ, నిర్మాణంలో, మరో నిర్మాణ హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎ.ఆర్.మోహన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి రాజేష్ దండు నిర్మాత. బాలాజీ గుత్త సహ నిర్మాత. ఆనంది హీరోయిన్గా నటిస్తోంది.
శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టైటిల్‌ను గమనిస్తే.. చుట్టు అడవి మధ్యలో కొందరు గ్రామస్థులు పిల్లలతో సహా నిలుచుని ఉన్నారు. వారి ముందు ఓ యువకుడు బల్లెం పట్టుకుని ధైర్యంగా నిలబడి ఉన్నారు. ముందున్న చెరువులో వారి ప్రతిరూపాలు కనిపిస్తున్నాయి.
వెన్నెల కిషోర్, ప్రవీణ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు అందిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
అల్లరి నరేష్ కెరీర్ లో మరో విలక్షణ చిత్రంగా నిలుస్తుంది ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. త్వరలోనే ఈ సినిమా నుంచి అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసి, అదే టైమ్ లో టీజర్ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించబోతున్నారు.

- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics