అల్లరి నరేష్ 'నాంది' ఫిబ్ర‌వ‌రి 19 విడుద‌ల‌

Monday,February 08,2021 - 11:56 by Z_CLU

అల్లరి నరేష్ పూర్తి భిన్న‌మైన, ఒక ఉద్వేగ‌భ‌రిత‌మైన పాత్ర‌ పోషిస్తున్న చిత్రం ‘నాంది’. ఈ సినిమా ద్వారా విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్‌వి2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్త‌యి, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ముగింపు ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 19న థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. బ్యాగ్రౌండ్‌ను బ్లాక్ క‌ల‌ర్‌లో డిజైన్ చేసిన ఈ పోస్ట‌ర్‌లో జైలుగ‌ది లోప‌ల కూర్చొని ఆలోచిస్తున్న అల్ల‌రి న‌రేష్ క‌నిపిస్తున్నారు. గ‌డ్డం పెంచుకొని ఉన్న న‌రేష్‌ను చూస్తుంటేనే ఇది ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కూ పోషించిన క్యారెక్ట‌ర్ల‌కు పూర్తి భిన్న‌మైన క్యారెక్ట‌ర్‌ను పోషించార‌ని అర్థ‌మ‌వుతోంది.

ఇదివ‌ర‌కు విడుద‌ల చేసిన స్టిల్స్ కానీ, పోస్ట‌ర్లు కానీ నాంది సినిమాపై ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తినీ, అంచ‌నాల‌నూ పెంచుతూ వ‌చ్చాయి. వాటికి ల‌భించిన స్పంద‌న‌తో చిత్ర బృందం చాలా సంతోషాన్ని వ్య‌క్తం చేస్తోంది. నిర్మాత సతీష్ వేగేశ్న ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు సిద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.