కొత్తదనానికి 'నాంది' !

Monday,January 20,2020 - 12:29 by Z_CLU

‘మహర్షి’ తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న అల్లరి నరేష్ ఎట్టకేలకు నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసాడు. విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు ‘నాంది’ అనే టైటిల్ ను ఖరారు చేసి పోస్టర్ వదిలారు. చీకటి గదిలో నరేష్ కాళ్ళకు గొలుసులు కట్టి తలకిందులుగా వేలాడదీసిన స్టిల్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తోంది.

క్రైం థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ఈనెల 22 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మార్చ్ కల్లా టోటల్ షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాను ‘ఎస్.వి2’ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నాడు.