అల్లరి నరేష్ 'మేడ మీద అబ్బాయి' రిలీజ్ డీటెయిల్స్

Thursday,August 17,2017 - 11:06 by Z_CLU

అల్లరి నరేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మేడమీద అబ్బాయి’ రిలీజ్ కి రెడీ అవుతుంది. జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జి.ప్రజీత్ దర్శకుడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రతిశుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన నిఖిల విమల్ హీరోయిన్ గా నటిస్తుంది. సో సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సినిమాతో థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చి తన మార్క్ కామెడీ తో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతు న్నాడన్నమాట నరేష్..