మేడమీద అబ్బాయి రిలీజ్ డేట్

Friday,August 18,2017 - 06:00 by Z_CLU

అల్లరి నరేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మేడమీద అబ్బాయి’ రిలీజ్ కి రెడీ అయింది. జి.ప్రజీత్ డైరెక్షన్ లో బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 8 న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.

రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన నిఖిల విమల్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని క్లీన్ యు సర్టిఫికెట్ పొందిన ఈ సినిమాతో సెప్టెంబరు 8 నుంచి థియేటర్స్ లో సందడి చేయబోతున్నారు నరేష్.