అల్లరి నరేష్ ఇంటర్వ్యూ

Wednesday,September 05,2018 - 05:01 by Z_CLU

ఈ నెల 7 న రిలీజవుతుంది అల్లరి నరేష్ సిల్లీఫెలో. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో M.L.A. కావాలనుకునే లేడీస్ టైలర్ లా కనిపించనున్నాడు అల్లరి నరేష్. అయితే సినిమాలో తన క్యారెక్టర్ తో పాటు సునీల్ క్యారెక్టర్ గురించి, ఓవరాల్ గా సినిమా గురించి మీడియాతో చాలా విషయాలు చెప్పుకున్నాడు అల్లరి నరేష్. అవి మీకోసం.

నేనే వీరబాబు…

సినిమాలో నా పేరు వీరబాబు.. బేసిగ్గా లేడీస్ టైలర్. కాకపోతే పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా M.L.A. అవ్వాలన్నది అతని కోరిక.

సునీల్ సూరిబాబు…

M.L.A. కావడం కోసం వీరబాబు ఎవరొస్తే వారిని వాడేసుకుంటూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లో సూరిబాబును కూడా వాడుకుంటాడు. ఏదొచ్చినా సూరిబాబు బుక్ అవుతుంటాడు. సూరిబాబు  ఆ ప్రాబ్లమ్స్ నుండి బయటపడే ప్రాసెస్ లో కామెడీ జెనెరేట్ అవుతుంది.

బ్యాక్ టు ఓల్డ్ ట్రాక్…

సినిమా సెట్స్ పైకి రాకముందే ఇద్దరం ( నేను, సునీల్ ) కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ఏం మిస్సవుతున్నాం మన సినిమాల్లో, ఆడియెన్స్ ఏం కోరుకుంటున్నారు..? అని డిస్కస్ చేసుకుని మరీ, మళ్ళీ పాత రూట్ లోనే ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధమయ్యాం.

సంచుల కొద్ది పంచులు…

ఈ సినిమాలో ఎక్కాడా కావాలని కామెడీ చేసినట్టు ఉండదు. డైలాగ్స్ కూడా సిచ్యువేషన్ కి తగ్గట్టే ఉంటాయి. సంచుల కొద్దీ పంచులు, SMS జోక్స్, స్పూఫ్స్ ఇలా ఏమీ లేకుండా స్టోరీ బేస్డ్ కామెడీ ఎంటర్ టైనర్ సిల్లీఫెలోస్…

క్రెడిట్ డైరెక్టర్ కే…

దాదాపు 2 ఇయర్స్ గా డైరెక్టర్ ఇదే సినిమాపై పని చేస్తున్నాడు కాబట్టి డెఫ్ఫినేట్ గా ఈ సినిమా సక్సెస్ అయితే  క్రెడిట్ భీమినేని గారికే ఇస్తా…

‘గమ్యం’ లో గాలిశీను…

మహేష్ బాబు గారి ‘మహర్షి’ సినిమాలో నా క్యారెక్టర్ ‘గమ్యం’ సినిమాలో గాలిశీను లా ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది.

క్యారెక్టర్ బావుంటే చాలు…

నాకు హీరోగానే చేయాలని ఏం లేదు. క్యారెక్టర్ బావుండాలి కానీ సినిమాలో నా క్యారెక్టర్ ఎంత సేపు ఉంటుందనేది పట్టించుకోను. కాకపోతే ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అయి ఉండాలి అంతే. ఏ సినిమా అయినా చేసేస్తా.

సెట్స్ పై సునీల్…

సెట్స్ పై సునీల్ చాలా జోవియల్ గా ఉంటాడు. ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటాడు. ఎక్స్ పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ కాబట్టి ఆయనతో పని చేయడం చాలా బావుంటుంది.

నాన్నగారి స్టైల్ లో…

మారుతి గారి డైరెక్షన్ లో సినిమా తప్పకుండా ఉంటుంది. ఈ సినిమాని కంప్లీట్ గా నాన్నగారి స్టైల్ లో ఆయన మార్క్ ఉండేలా తీయాలనేది ఆయన ప్లాన్. ఆ రేంజ్ కథ కుదరాలి కాబట్టే టైమ్ పడుతుంది. ఈ సినిమా సొంత బ్యానర్ లో  ఉంటుంది.

ఆయన కోరిక అదే…

నేను, ఆర్యన్ రాజేష్ ని యాక్టర్స్ గా చూడాలనేది నాన్న కోరిక. యాక్టర్ గా రాజేష్ సక్సెస్ కాకపోయినా, మళ్ళీ తాను ప్రూఫ్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నాడు. రామ్ చరణ్ సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు.

 

కంటెంట్ ఉంటేనే…

కంటెంట్ ఉంటేనే ఏ ఆర్టిస్ట్ అయినా పర్ఫామ్ చేయగలుగుతాడు. ఆడియెన్స్ ని నవ్వించడానికి కామెడీ ఉంటే పర్వాలేదు కానీ, ఆ సినిమాలో ఇమోషన్ మిస్సయితే కనెక్ట్ ఎవరూ కనెక్ట్ అవ్వరు. అందుకే ఇమోషన్ ఉండేలా చూసుకుంటూనే సినిమాలు ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నా.

వెబ్ సిరీస్ కూడా చేస్తా కానీ…

మంచి కథ దొరికితే తప్పకుండా వెబ్ సిరీస్ చేస్తా. కానీ అది కామెడీ స్టోరీ కాకపోతే బెటర్. ఎందుకంటే సినిమాలో కామెడీ చేసి, వెబ్ సిరీస్ లో కూడా కామెడీ చేయకూడదు అనుకుంటున్నా.. ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టోరీ దొరికి పర్ఫామెన్స్ కి స్కోప్ దొరికితే తప్పకుండా చేస్తా.

విలన్ అవుదామనుకున్నా…

నేను సినిమాల్లోకి రాకముందు విలన్ రోల్స్ ప్లే చేయాలి అనుకునేవాణ్ణి. రఘువరన్ నా ఇన్స్ పిరేషన్. కానీ రవిబాబు గారు కామెడీ హీరోగా ఇంట్రడ్యూస్ చేసేసరికి ఆడియెన్స్ కి అలాగే కనెక్ట్ అయ్యాను. సినిమాల్లో ఆడియెన్స్ నానుండి ఏం ఎక్స్ పెక్ట్ చేస్తున్నారో అదే చేస్తాను. వెబ్ సిరీస్ లో నాకు నచ్చినవి చేస్తాను.

కామెడీ చేసిన వారు…

అన్నిటి కన్నా కష్టమైనా పని నవ్వించడమే. కామెడీ టైమింగ్ తెలిసిన వాడు ఏదైనా చేయగలుగుతాడు.

 

‘శతమానంభవతి’ లాంటి సినిమా…

నాకు ‘శతమానం భవతి’ లాంటి కామెడీ సినిమా చేయాలని ఉంది. అంతమంది ఆర్టిస్టులతో సందడి సందడిగా కలర్ ఫుల్ సినిమా చేయాలి.

నేను రాస్తే అలా ఉండాలి…

నేనసలు కామెడీ స్టోరీస్ రాయలేను. నేను రాయడం మొదలు పెడితే, ఈ కథలో హీరోయిన్ ని ఎక్కడ చంపేయాలి, ఎలా చంపేయాలి అని ఆలోచిస్తుంటా.  అలా ఉంటాయి నా ఆలోచనలు…

2020 లో సొంత డైరెక్షన్…

లో బడ్జెట్ లో సినిమా చేస్తా.. మహా అయితే 4, 5 కోట్ల బడ్జెట్ లో కొత్తవాళ్ళతో సినిమా చేస్తా. ఆ సినిమాలో నేను నటించను.

కొత్త సినిమా

గిరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా రీసెంట్ గా పొలాచీ లో సాంగ్ షూట్ చేసుకుని వచ్చాం. 80% సినిమా షూటింగ్ అయిపోయింది. ఈ సినిమా బెండు అప్పారావ్ స్టైల్ లో ఉండబోతుంది. నవంబర్ లేదా డిసెంబర్ లో సినిమా రిలీజ్ చేస్తాం.