మహేష్ బాబు సినిమాలో అల్లరి నరేష్

Friday,June 30,2017 - 04:21 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో అల్లరి నరేష్ కూడా నటిస్తున్నాడనే టాక్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. స్పైడర్ తో పాటు, కొరటాల శివ సినిమాకి ప్యాకప్ చెప్పీ చెప్పగానే వంశీ పైడిపల్లి తో సెట్స్ పై ఉంటాడు సూపర్ స్టార్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సినిమా యూనిట్, ఓ కీ రోల్ కోసం అల్లరి నరేష్ ని అప్రోచ్ అయ్యారని తెలిసింది. అయితే బర్త్ డే సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన అల్లరి నరేష్ ఆ విషయంలో క్లారిటీ ఇచ్చాడు.

అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న మహేష్ బాబు వంశీ పైడిపల్లి సినిమా కోసం తనను అప్రోచ్ అయిన మాట నిజమేనని చెప్పిన అల్లరి నరేష్, ఇంకా ఈ విషయంలో ఏ డెసిషన్ తీసుకోలేదని చెప్పాడు. ఒకవేళ ఏదైనా ఉంటే తానే స్వయంగా అనౌన్స్ చేస్తానని చెప్పుకున్నాడు అల్లరి నరేష్.  ప్రస్తుతం మేడ మీద అబ్బాయి సినిమాతో బిజీ బిజీగా ఉన్న అల్లరి నరేష్ ఈ రోజు తన పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు.