నాకేం భయం లేదంటున్న అల్లరోడు

Tuesday,September 06,2016 - 01:31 by Z_CLU

 

కామెడీ హీరోగా ఏడాదికి రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించే అల్లరి నరేష్ గత కొన్ని చిత్రాలతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోతున్నాడనే చెప్పాలి. స్పూఫ్ లు కామెడీ కుటుంబ కథ చిత్రాలతో ఇప్పటి వరకూ అలరించిన అల్లరోడు మొన్నా మధ్య విభిన్న చిత్రాలతో ఆకట్టుకొనే రవి బాబు తో కలిసి ‘లడ్డు బాబు’ అనే కొత్త పాత్రా ట్రై చేసి బోల్తా పడ్డాడు. ఇక ఇటీవలే నరేష్ నటించిన ‘మామ మంచు అల్లుడు కంచు’, ‘ సెల్ఫీ రాజా’ సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోవడంతో ఈసారి తను ఇప్పటి వరకూ టచ్ చెయ్యని హర్రర్ కామెడీ ను టచ్ చేయబోతున్నాడు . ప్రస్తుతం ఈ జోనర్ లో అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం లో ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ రెండు పాటల మినహా పూర్తయ్యింది. విజయ దశమి కానుకగా విడుదల కానున్న ఈ జోనర్ తో నరేష్ ఎలాంటి విజయం అందుకుంటాడా? చూడాలి..