నాగ్ టైటిల్ తో చైతు ....

Wednesday,February 22,2017 - 09:05 by Z_CLU

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, కళ్యాణ్ కృష్ణ తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసందే. లవ్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నాడు…

దాదాపు 70% శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు మొన్నటివరకూ నాగార్జున నటించిన ‘నిన్నే పెళ్లాడతా’ టైటిల్ పెట్టబోతున్నారనే వార్త వినిపించగా లేటెస్ట్ గా మరో టైటిల్ తెరపైకి వచ్చింది.. ప్రెజెంట్ ఈ సినిమాకు నాగార్జున నటించిన ‘అల్లరి అల్లుడు’ టైటిల్ ను ఫిక్స్ ఫిక్స్ చేశారట యూనిట్.. గతంలో నాగ్ నటించిన ‘నిన్నే పెళ్లాడతా’ తరహాలో లవ్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు ఈ టైటిల్ బాగుంటుందని భావించిన యూనిట్ ఈ టైటిల్ ను ఖరారు చేశారనే టాక్ వినిపిస్తుంది….