సెకండ్ షెడ్యూల్ కి అంతా రెడీ

Wednesday,June 07,2017 - 02:04 by Z_CLU

అఖిల్ రెండో సినిమా సెకండ్ షెడ్యూల్ కి అంతా రెడీ అయిపోయింది. ఈ నెల 13 నుండి మళ్ళీ సెట్స్ పైకి రావాలని  ముందే స్కెచ్ వేసుకున్న సినిమా యూనిట్, ఈ షెడ్యూల్ లో తెరకెక్కించబోయే స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ప్రిపేర్ అవుతుంది. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కేవలం యాక్షన్ సీక్వెన్సెస్ కోసం 12 కోట్ల బడ్జెట్ స్పెండ్ చేయనున్నాడు నాగార్జున.

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాలేదు. ఫస్ట్ షెడ్యూల్ కి, సెకండ్ షెడ్యూల్ కి మధ్య దొరికిన గ్యాప్ లో, ఫీమేల్ లీడ్ కి సంబంధించి చాలా ఆప్షన్స్ ని పరిశీలించిన సినిమా యూనిట్ ఇంకా ఫైనల్ డెసిషన్ కి మాత్రం రాలేదు. మరోవైపు ఈ సెకండ్ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పే లోపు, హీరోయిన్ ఎవరో అనౌన్స్ చేయడం గ్యారంటీ అని ఫిక్స్ అయి ఉన్నారు ఫ్యాన్స్.

ఏది ఏమైనా ఫస్ట్ మూవీ తరవాత గ్యాప్ తీసుకుని మరీ, సక్సెస్ గ్యారంటీ అని ఫిక్స్ అయ్యాకే సెట్స్ పైకి వచ్చిన అఖిల్, ఈ సినిమా విషయంలో చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాడు. క్లాస్, మాస్ అని తేడా లేకుండా కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ ప్యాకేజీ లా తెరకెక్కనున్న ఈ సినిమా అప్పుడే టాలీవుడ్ లో చిన్న సైజు బజ్ ని క్రియేట్ చేయడం బిగిన్ చేసేసింది.