నాని ఫిక్స్ అయ్యాడు నెక్స్ట్ సినిమా అదే...

Sunday,November 25,2018 - 03:06 by Z_CLU

విక్రం కుమార్ తో నెక్స్ట్ సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు నాని.. ఈ కాంబినేషన్ పై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు కానీ ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ కూడా లాక్ అయిందని సమాచారం. ప్రస్తుతం గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో ‘జెర్సీ’ సినిమా చేస్తున్న నేచురల్ స్టార్ ఈ సినిమాను ఫిబ్రవరి లేదా మార్చ్ వరకూ కంప్లీట్ చేయనున్నాడు. జెర్సీ ఫినిష్ అవ్వగానే విక్రం కుమార్ సినిమాను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడట నాని.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని తెలుస్తుంది. మరి నాని విక్రం కాంబినేషన్ లో తెరకెక్కే ఈ సినిమా ఏ జోనర్ లో ఉంటుందో… చూడాలి.