మిస్టర్ కి కలిసొచ్చిన బాహుబలి 2

Monday,April 10,2017 - 07:10 by Z_CLU

వరుణ్ తేజ్ మిస్టర్ రిలీజ్ కి ఇంకా జస్ట్ 4 రోజులుంది. శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ లవ్ ఎంటర్ టైనర్ ఇప్పటికే రిలీజైన ట్రేలర్స్, సాంగ్స్ తో మ్యాగ్జిమం ఎట్రాక్ట్ చేసేసింది. సినిమా యూనిట్ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రమోషన్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సినిమా హైయెస్ట్ ఓపెనింగ్స్ ని బ్యాగ్ లో వేసుకోవడం గ్యారంటీ అనిపిస్తుంది. దానికి తోడు బాహుబలి 2 సినిమా కూడా ఈ మిస్టర్ కి బోలెడంత కలిసి వస్తుంది.

బాహుబలి ఏప్రిల్ 28 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కాబట్టి ఆబివియస్ గానే తర్వాత వచ్చే థియేటర్స్ ఇబ్బందులను మైండ్ లో పెట్టుకుని ఏ సినిమా రిలీజ్ కావడం లేదు. అంటే మిస్టర్ కి బాహుబలి 2 కి మధ్య ఉండే 2 వారాల గ్యాప్ లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కావడం లేదు. కాబట్టి ఈ రెండు వారాలు ఏ మాత్రం కాంపిటీషన్ లేకుండా బాక్సాఫీస్ ని ‘మిస్టర్’ ఒక్కడే దర్జాగా రూల్ చేయబోతున్నాడు.

అల్టిమేట్ మాస్ ఎంటర్ టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ లాంటి శ్రీనువైట్ల అండ్ టీమ్ ఆల్ రెడీ ఈ సినిమా కోసం ఫుల్ ఫ్లెజ్డ్ గా ప్రమోషన్స్ బిగిన్ చేసేశారు. మిక్కీ జె. మేయర్ మ్యూజికల్ మ్యాజిక్ ఇప్పటికే మ్యాగ్జిమం యూత్ కి ఎడిక్ట్ అయిపోయింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్స్ నటించిన విషయం తెలిసిందే.