Prabhas Radheshyam - అందరి చూపు ఈ సినిమా మీదే!

Saturday,January 22,2022 - 06:24 by Z_CLU

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులతో పాటు మూవీ లవర్స్ అంతా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమల్లో ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ఒకటి. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఇంకా కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వలేదు. అంతా అనుకున్నట్లు జరిగితే సినిమాను సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు నిర్మాతలు. కానీ ఓమిక్రాన్ ఎఫెక్ట్ వల్ల సినిమా రిలీజ్ ని వాయిదా వేస్తున్నట్లు చెప్తూ త్వరలోనే కొత్త డేట్ ప్రకటిస్తామని తెలిపారు.

అప్పటి నుండి ఇంత వరకూ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించలేదు. తాజాగా రామ్ చరణ్ , ఎన్టీఆర్ లతో రాజమౌళి తీసిన పాన్ ఇండియా సినిమా కొత్త డేట్స్ ప్రకటించేశారు జక్కన్న. మార్చి 18 లేదా ఏప్రిల్ 28 న రిలీజ్ అంటూ రెండు డేట్స్ చెప్పి లాక్ చేసుకున్నారు. దీంతో ఇప్పుడు అందరి చూపు ప్రభాస్ సినిమా పై పడింది. అసలు రాధే శ్యామ్ ఎప్పుడు వస్తుంది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మేకర్స్ ని క్వశ్చన్ చేస్తూ అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతానికయితే సినిమాను మార్చ్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఫిబ్రవరి వరకూ అంతా నార్మల్ అయితే మిగతా రాష్ట్రాల్లో థియేటర్స్ అన్ని తెరిస్తే కచ్చితంగా మార్చ్ లోనే రావాలని చూస్తున్నారు. సంక్రాంతి బరిలో RRR ఉన్నప్పటికీ ప్రకటించిన డేట్ వద్దమనుకున్నారు నిర్మాతలు. ఇప్పుడు కూడా అదే విధంగా RRR ఉన్నప్పటికీ మార్చ్ లోనే వచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే రాధే శ్యామ్ కొత్త రిలీజ్ డేట్ అఫీషియల్ గా రానుంది. అప్పటి వరకు ప్రభాస్ సినిమా ఎప్పుడు ? క్వశ్చన్ ఫ్యాన్స్ లో ఉంటూనే ఉంటుంది.