మరికొన్ని గంటల్లో మెగా సంబరం

Sunday,December 04,2016 - 10:36 by Z_CLU

తెలుగు రాష్ట్రాల మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ధృవ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ మరికొన్ని గంటల్లో ఘనంగా ప్రారంభంకానుంది. హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ లైన్స్ లో ఈ వేడుక కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సినీప్రముఖులతో పాటు మంత్రి కేటీఆర్ లాంటి రాజకీయ ప్రముఖులు కూడా వస్తుండడంతో… సభా ప్రాంగణం వద్ద పటిష్ట భద్రతాచర్యలు చేపట్టారు. అటు అభిమానులకు కూడా అందరికీ పాసులు ఇవ్వకుండా…. లెక్క ప్రకారం కొందరికి మాత్రమే పాస్ లు కేటాయించారు. వేదిక వద్దకు వచ్చే ప్రతి ఒక్కరినీ క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించబోతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే… సాధారణంగా జరిగే సినిమా ఫంక్షన్ కంటే కాస్త భిన్నంగా, స్ట్రిక్ట్ గా ధృవ ప్రీ-రిలీజ్ వేడుక జరగబోతోంది.
dhruva-dance-making
ఈ ఈవెంట్ తో సినిమాను పబ్లిసిటీ పరంగా టాప్ పొజిషన్ లో పెట్టాలని మెగా కాంపౌండ్ భావిస్తోంది. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పూర్తయిన వెంటనే… మీడియాకు ఇంటర్వ్యూలు ప్రారంభం అవుతాయి. సురేందర్ రెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. అరవింద్ స్వామి విలన్ గా కనిపించనున్నాడు.