Alia Bhatt - మరో 2 వారాలు వెయిటింగ్

Wednesday,November 11,2020 - 05:23 by Z_CLU

లెక్కప్రకారం ఈపాటికి సెట్స్ పైకి రావాలి. కానీ ఇంకా అలియాభట్ జాయిన్ అవ్వలేదు. మరో 2 వారాల పాటు RRR యూనిట్ కు నిరీక్షణ తప్పదు.

సినిమా సెట్స్ పైకి తీసుకురావడానికి ముందే Alia కు ఇంటిమేషన్ ఇచ్చారు. కాల్షీట్లు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. కానీ అదే సమయంలో సంజయ్ లీలా భన్సాలీ తన కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. అంతే కాదు, షెడ్యూల్స్ పొడిగించాడు కూడా.

దీంతో ఇంకాస్త ఆలస్యంగా RRR సెట్స్ పైకి రాబోతోంది అలియాభట్. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెలాఖరుకు ఆమె సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం RRR Shooting హైదరాబాద్ లో జరుగుతోంది. కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ తీస్తున్నారు. రాజమౌళి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించబోతున్నారు.

Also Check – RRR స్టిల్స్