లాక్ డౌన్ లో అలీ చేస్తున్న పని ఇది

Sunday,March 29,2020 - 02:28 by Z_CLU

రోజూ కార్లు కడుగుతున్నా.. ఇంట్లో పని చేస్తున్నా. కాయగూరలు కట్‌ చేస్తున్నా. ఇల్లంతా శుభ్రపరుస్తున్నా. అప్పుడప్పుడు ఓ గంటో, గంటన్నరో టీవీ చూస్తున్నా. ఇంకా మా ఆవిడ ఏ పని చెబితే అది చేస్తున్నా.. వంట పని లాంటివి. నాకు కొన్ని వంటలు వచ్చు. బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు రూమ్‌లో వంట చేసేవాణ్ణి.. అందుకని నన్ను బాడుగ (అద్దె) కట్టమనేవాళ్లు కాదు.

బ్యాచిలర్ గా ఉన్నప్పుడు నా బట్టలు నేనే ఉతుక్కునేవాణ్ణి. ఇస్త్రీ మాత్రం బయట చేయించుకునేవాణ్ణి. అప్పుడు షర్ట్‌కి యాభై పైసలు, ప్యాంటుకి యాభై పైసలు ఉండేది. ఇంటిలో మన పని మనం చేసుకోవడంలో తప్పేమీ లేదు. ఏం మనం స్నానం చేయడం లేదా? వేరే వాళ్లు చేయిస్తున్నారా? ఇది అలాంటిదే.