Alanti Sitralu - హార్ట్ టచింగ్ ట్రయిలర్

Wednesday,March 24,2021 - 12:57 by Z_CLU

తెరపై నటులు ఎవరనేది ఇంపార్టెంట్ కాదు, ఆ పాత్రలు ఎంత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాయనేది ఇప్పుడు ముఖ్యం. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో ఇప్పుడు డిఫరెంట్ స్టోరీస్, నెరేషన్స్ కనిపిస్తున్నాయి. ఈ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ వస్తోంది ”అలాంటి సిత్రాలు” మూవీ.

దాదాపు అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి కొద్దిసేపటి కిందట ట్రయిలర్ రిలీజ్ చేశారు. ట్రయిలర్ చూస్తే ఇదొక ఎమోషనల్ డ్రామా అనే విషయం అర్థమౌతోంది. మరీ ముఖ్యంగా సినిమా ఓ 4-5 కీలకమైన పాత్రల చుట్టూ తిరుగుతుంది.

వీళ్లలో ఓ చిన్నారి తండ్రి, ఓ ఔత్సాహిక బాక్సర్, ఓ మ్యూజీషియన్, ఓ వేశ్య ఉన్నారనే విషయం ట్రయిలర్ లో కనిపిస్తోంది. వీళ్ల జీవితాలు ఎలా మారాయి, వీళ్ల జీవితాల మధ్య కనెక్షన్ ఏమైనా ఉందా అనేది ఈ సినిమాలో డిస్కషన్ పాయింట్ గా కనిపిస్తోంది.

ట్రయిలర్ రిచ్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరాయి. “బ్రతకడానికి ఏ పని చేసినా తప్పులేదు. ఇది తప్పు అని చెప్పడానికి ఇక్కడెవ్వడూ కరెక్ట్ కాదు, ఎవడి ప్రాస్టిట్యూషన్ వాడు చేస్తున్నాడు.” లాంటి డెప్త్ ఉన్న డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.

సుప్రీత్ కృష్ణ డైరక్ట్ చేసిన ఈ సినిమాను రాఘవేంద్రరెడ్డి సమర్పిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు.