"అల వైకుంఠపురములో" ట్రయిలర్ రివ్యూ

Tuesday,January 07,2020 - 11:25 by Z_CLU

ఎలాంటి ప్రయోగాల్లేవ్. ఎక్కడా సీరియస్ నెస్ లేదు. సరదాగా సాగిపోయే సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారు. అలానే తీశారు. అదే ట్రయిలర్ లో కనిపించింది. అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి రాత్రి రిలీజ్ చేసిన ట్రయిలర్ సరదాగా సాగిపోయింది.

ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ పంచ్ లు, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, ఫైట్స్, హీరోయిజం, విలనీ… వీటిన్నింటికీ మించి సూపర్ హిట్ సాంగ్స్. ఇలా అల వైకుంఠపురములో అన్నీ ఉన్నాయని చెప్పకనే చెప్పేసింది ట్రయిలర్. దీంతో పాటు హీరో క్యారెక్టరైజేషన్ పై కూడా చిన్న హింట్ ఇచ్చారు.

సినిమాలో హీరో రిచ్ గా బతకాలనుకుంటే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. దీనికి తోడు చచ్చినా అబద్ధం ఆడని నైజం. ఇది వైకుంఠపురములో బన్నీ క్యారెక్టరైజేషన్. ఎప్పట్లానే పూజా హెగ్డే ట్రయిలర్ లో దేవతలా కనిపించింది. మరో హీరోయిన్ నివేత పెతురాజ్ కు కూడా చోటు దక్కింది.

టెక్నికల్ గా సినిమా టాప్-క్లాస్ లో ఉంది. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ ట్రయిలర్ లో ప్రతి ఫ్రేమ్ ను రిచ్ గా చూపించింది. సాంగ్స్ తో ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసిన తమన్, ట్రయిలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా అదరగొట్టాడు. టబు, రాజేంద్రప్రసాద్, సముత్తరఖని, సునీల్, సుశాంత్, నవదీప్.. ఇలా భారీ తారాగణంతో తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమా 12వ తేదీ నుంచి థియేటర్లలోకి సంక్రాంతిని తీసుకురాబోతోంది.