అల వైకుంఠపురములో నాన్-బాహుబలి రికార్డులు

Thursday,January 16,2020 - 02:15 by Z_CLU

బన్నీ-త్రివిక్రమ్ కలిసి చేసిన అల వైకుమంఠపురములో సినిమా రోజురోజుకు తన వసూళ్లు పెంచుకుంటోది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో నాన్-బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది.

నిన్నటితో 4 రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో 7 ఏరియాల్లో నాన్-బాహుబలి రికార్డులు క్రియేట్ చేసినట్టు మేకర్స్ ప్రకటించారు. నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్రతో పాటు.. కృష్ణా, వెస్ట్, గుంటూరు, నెల్లూరు ఏరియాస్ లో అల వైకుంఠపురములో సినిమా వసూళ్ల పరంగా నాన్-బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది. ఈ మేరకు యూనిట్ నుంచి పోస్టర్ కూడా వచ్చింది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. 4వ రోజు ముగిసేసరికి తెలుగు రాష్ట్రాల్లో బన్నీ మూవీకి 58 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 74 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్టు టాక్. విడుదలైన ప్రతి సెంటర్ లో ఈ సినిమాకు రోజురోజుకు ఆక్యుపెన్సీ పెరుగుతోంది.

యూఎస్ లో ఈ సినిమాకు 16 లొకేషన్లలో స్క్రీన్స్ పెంచారు. ప్రస్తుతం ఈ మూవీ, ఓవర్సీస్ లో సరిలేరు నీకెవ్వరు కలెక్షన్ ను క్రాస్ చేసింది. 1.8 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ మరికొన్ని గంటల్లో 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటర్ కాబోతోంది. కంప్లీట్ రన్ లో ఈ మూవీ ఓవర్సీస్ లో 3 మిలియన్ మార్క్ టచ్ చేసే ఛాన్స్ ఉంది.