"అల.." వచ్చింది.. ఇలా మేజిక్ క్రియేట్ చేసింది

Monday,January 20,2020 - 02:01 by Z_CLU

అంచనాలు తలకిందులయ్యాయి. వసూళ్లు లిమిట్స్ దాటిపోయాయి. ఊహించని విధంగా అల వైకుంఠపురములో సినిమా ఓవర్సీస్ లో వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే 2 మిలియన్ డాలర్ మార్క్ క్రాస్ చేసిన ఈ సినిమా తన ఫైనల్ రన్ లో 3 మిలయన్ డాలర్లు వసూళ్లు సాధించే ఛాన్స్ ఉందని ట్రేడ్ అంచనా వేసింది. కానీ అది తలకిందులైంది.

ఆల్రెడీ బన్నీ మూవీ 3 మిలియన్ కు దగ్గరైంది. ఆదివారం నాటి వసూళ్లతో కలుపుకొని ఈ సినిమా ఏకంగా 2.8 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. నిజానికి ఆదివారం నాటి వసూళ్లతో ఇది 2.4 మిలియన్ డాలర్లు సాధిస్తుందని ట్రేడ్ అంచనా వేసింది. కానీ ఒక్క రోజులోనే ఈ సినిమా 3 లక్షల డాలర్ల వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించింది.

రిలీజ్ తర్వాత రెండో శనివారం, రెండో ఆదివారం ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన సినిమా బాహుబలి-2 తర్వాత అల వైకుంఠపురములో మాత్రమే. రేసుగుర్రం తర్వాత బన్నీ నటించిన ఓ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఓవర్సీస్ లో ఇదే ఫస్ట్ టైమ్. లేటెస్ట్ అప్ డేట్స్ ప్రకారం, ఈ సినిమా మరో 48 గంటల్లో 3 మిలియన్ డాలర్ మార్క్ అందుకునే ఛాన్స్ ఉంది.