ఓవర్సీస్ లో ఆల్ టైమ్ టాప్-5లో "అల"

Saturday,January 25,2020 - 04:04 by Z_CLU

సంక్రాంతి కానుకగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్ అంటే మామూలు హిట్ కాదు. ఏకంగా ఆల్ టైమ్ టాప్ గ్రాసర్స్ లిస్ట్ లోకి చేరిపోయింది. మొన్నటివరకు టాప్-10 లిస్ట్ లో ఉన్న ఈ సినిమా, ఇప్పుడు ఏకంగా టాప్-5 లిస్ట్ లోకి ఎగబాకింది.

కళ్లముందే మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిన ఈ సినిమా తాజాగా ఓవర్సీస్ ఆల్ టైమ్ టాప్-5 లిస్ట్ లోకి చేరిపోయింది. ఈ క్రమంలో శ్రీమంతుడు, సైరా, మహానటి, గీతగోవిందం లాంటి ఎన్నో సినిమాల్ని క్రాస్ చేసింది బన్నీ మూవీ. రీసెంట్ గా వచ్చిన సాహో సినిమా కూడా బన్నీ ముూవీ దెబ్బకు వెనక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతానికి అల వైకుంఠపురములో సినిమాకు భరత్ అనే నేను సినిమా పోటీగా నిలిచింది. అది కూడా క్రాస్ చేస్తే టాప్-4కు ఎగబాకుతుంది ఈ మూవీ.

1. బాహుబలి 2 – $ 20,571,695
2. బాహుబలి 1 – $ 6,999,312
3. రంగస్థలం – $ 3,513,450
4. భరత్ అనే నేను – $ 3,416,451
5. అల వైకుంఠపురములో – $ 3,234,396