బన్నీ సాంగ్ టీజర్ రిలీజ్ వాయిదా

Monday,October 21,2019 - 04:18 by Z_CLU

లెక్కప్రకారం, ఈపాటికి బన్నీ సినిమా నుంచి సెకెండ్ సాంగ్ టీజర్ వచ్చేయాలి. కానీ అనుకోకుండా ఆ కార్యక్రమం వాయిదాపడింది. అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి సెకెండ్ సాంగ్ టీజర్ ను రేపు విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

రాములో రాములా అనే లిరిక్స్ తో సాగే ఈ పాట టీజర్ కోసం కాస్త గట్టిగా వర్క్ చేస్తోంది యూనిట్. అందుకే బెటర్ ఔట్ పుట్ కోసం మరో 24 గంటలు ఎక్స్ ట్రా టైమ్ తీసుకోవాలని నిర్ణయించారు. అందుకే సాంగ్ టీజర్ రిలీజ్ ను రేపటికి పోస్ట్ పోన్ చేసినట్టు ప్రకటించారు హారిక-హాసిని నిర్మాతలు.

ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సామజవరగమన అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ కు ఏకంగా 7లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. తెలుగులో ఇప్పటివరకు ఏ పాటకు ఇన్ని లైక్స్ రాలేదు. అందుకే ఈ సినిమా నుంచి రాబోతున్న సెకెండ్ సాంగ్ పై అంచనాలు పెరిగాయి.

రెండో పాట మాస్ బీట్ లో ఉండపోతోంది. దీనికి సంబంధించి రిలీజ్ చేసిన బన్నీ స్టిల్ ఇప్పటికే వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.