7 నిమిషాల్లో 1 మిలియన్ వ్యూస్

Wednesday,December 11,2019 - 05:53 by Z_CLU

సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ‘అల… వైకుంఠపురములో ‘ టీజర్. కేవలం 7 నిమిషాల్లో 1 మిలియన్ వ్యూస్ దాటింది. ఇంకా ప్రతి నిమిషానికి సంఖ్య పెంచుకుంటూనే ఉంది ఈ టీజర్. ఈ రోజు నాలుగు గంటల ఐదు నిమిషాలకు సోషల్ మీడియాలో రిలీజ్ అయిన ఈ టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమాకి ఫ్యాన్స్ లో ఏ స్థాయి డిమాండ్ ఉందో తెలిసిపోతుంది.   

ఈ రోజు రిలీజ్ ఉందన్న విషయం ముందుగానే అనౌన్స్ చేశారు మేకర్స్. దానికి తగ్గట్టుగా ఈ టీజర్ చుట్టూ క్యూరియాసిటీ జెనెరేట్ అయ్యేలా ప్రమోట్ కూడా చేశారు. అల్టిమేట్ గా ఫ్యాన్స్ లో ఏ స్థాయి అంచనాలైతే పెరిగాయో వాటిని అదే స్థాయిలో అందుకోగలిగింది ‘అల.. వైకుంఠపురములో..’ టీమ్. 

ఓ వైపు సాంగ్స్ బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఈ టీజర్ కూడా అదే స్థాయి సక్సెస్ అందుకుంటుంది. ఇదే స్పీడ్ లో ఈ సినిమా నుండి మరిన్ని సర్ ప్రైజెస్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. జస్ట్ టీజర్ కే రెస్పాన్స్ ఈ స్థాయిలో ఉంటే, పండక్కి థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో విన్నర్ గా నిలవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.