‘అల వైకుంఠపురం లో’ Vs ‘సరిలేరు నీకెవ్వరు’

Wednesday,November 27,2019 - 10:03 by Z_CLU

ఈ ఏడాది సంక్రాంతి వైభవాన్ని పెంచబోతున్న సినిమాలు. ఇప్పటికే ఒకేరోజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి టాలీవుడ్ ని షేక్ చేసిన ఈ సినిమాలు అన్ని విషయాల్లో గట్టిగా పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు 1 రోజు ముందుగా రావడానికి సర్దుబాటు చేసుకున్నా. ఈ రెండు సినిమాలపై ఉన్న  క్రేజ్ మరింత బలంగా పోటీ పడుతుంది.

మహేష్ బాబు Vs అల్లు అర్జున్ : చాలా రోజుల మహేష్ బాబు మళ్ళీ మాస్ అవతార్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇటు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ పై పాస్ట్ సక్సెస్ ఇంపాక్ట్ ఉంది. దానికి తోడు ఈ సినిమా సాంగ్స్ క్రియేట్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.

త్రివిక్రమ్ Vs అనిల్ రావిపూడి : త్రివిక్రమ్ ‘అరవింద సమేత’ బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా చేస్తున్న సినిమా ఇది. అటు అనిల్ రావిపూడి ‘F2’ ఈ దర్శకుడిని సంక్రాంతి దర్శకుడు అనేలా చేసింది.

పూజా హెగ్డే Vs రష్మిక : ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్స్ వీళ్ళిద్దరూ. ఇద్దరికీ ఇద్దరు కరియర్ లో గోల్డెన్ ఫేజ్ లో ఉన్నవాళ్ళే. పూజా హెగ్డే, బన్నిల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఫ్యాన్స్ కి పరిచయమే. ఇక రష్మిక ఫస్ట్ టైమ్ సూపర్ స్టార్ సరసన నటిస్తుంది.

టాబూ Vs విజయశాంతి : ఈ ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ స్క్రీన్ పై కనిపించబోయేది లాంగ్ గ్యాప్ తరవాతే. ఇంకా టాబూ లుక్స్ బయటికి రాలేదు కానీ రీసెంట్ గా రిలీజైన ‘సరిలేరు…’ టీజర్ ని బట్టి విజయశాంతి ప్లే చేసింది ఇంపార్టెంట్ రోల్ అని తెలుస్తుంది.

DSP Vs తమన్: ఇద్దరూ క్రేజ్ లో ఉన్న మ్యూజిక్ కంపోజర్సే… ఇప్పటికే ‘అల’ సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. మరోవైపు మహేష్ బాబు, DSP కాంబినేషన్ పై భారీ అంచనాలున్నాయి.