అల వైకుంఠపురం ఫస్ట్ లుక్

Sunday,September 01,2019 - 11:55 by Z_CLU

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు. తాజాగా వినాయక చవితి కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంఛ్ చేశారు. త్రివిక్రమ్ మార్క్, బన్నీ స్టయిల్ రెండూ కనిపిస్తున్నాయి ఈ ఫస్ట్ లుక్ లో.

కాస్ట్ లీ కారు ముందు, పాత చెక్క స్టూల్ పైన ఖరీదైన సూట్ వేసుకొని బన్నీ కూర్చున్నాడు. ఓ సెక్యూరిటీ గార్డ్ వచ్చి బన్నీ సిగరెట్ ను లైటర్ తో వెలిగిస్తాడు. ఈ పోజును ఫస్ట్ లుక్ కింద విడుదల చేశారు. ప్రస్తుతం ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సుశాంత్, నవదీప్, టబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా సినిమా విడుదలకానుంది.