'అక్షర' ట్రైలర్ టాక్

Tuesday,February 16,2021 - 06:10 by Z_CLU

నందితా శ్వేత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అక్షర’ సినిమా  ఈ నెల 26న థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. రెండు నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ లో సినిమాలో ఉన్న మెయిన్ కంటెంట్ తెలియజేశారు. విద్యారంగంలో జరుగుతున్న అవినీతిపై ఒక ఉపాధ్యాయురాలు చేసే పోరాటం ఆదరంగా తెరకెక్కిన సినిమా అని ట్రైలర్ తో పూర్తిగా క్లారిటీ ఇచ్చారు.

సినిమాలో నందితా శ్వేతా క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉండనుందో ట్రైలర్ లో సీన్స్ చూస్తే తెలుస్తోంది. సినిమాలో ఉన్న కొన్ని హైలైట్ సీన్స్ ను ట్రైలర్ లో జత చేసి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశారు. ముఖ్యంగా సురేష్ బొబ్బిలి మ్యూజిక్ , నాగేష్ బనేల్ సినిమాటోగ్రఫీ హైలైట్ అనిపించాయి. డైరెక్టర్ చిన్ని కృష్ణ టేకింగ్ , డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. “చదువన్నది ఈ దేశంలో ప్రతీ పౌరుడికి ప్రాధమిక హక్కు.. దాన్ని డబ్బుతో కొనుక్కోవడం తప్పు”, భూమి ని నమ్ముకున్నోడు రైతు..చదువును నమ్ముకున్నోడు రాజు” అంటూ హర్ష వర్ధన్ చెప్పే డైలాగ్స్ సినిమాలో ఉన్న డెప్త్ ని తెలియజేసేలా ఉన్నాయి.

సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అహితేజ బెల్లంకొండ , సురేష్ వర్మ నిర్మించిన ఈ సినిమా  ఫిబ్రవరి 26న రిలీజ్ కానుంది.