అక్కినేని నామ సంవత్సరం ...

Tuesday,November 08,2016 - 10:00 by Z_CLU

2016 అక్కినేని నామ సంవత్సరం అనే చెప్పాలి. ఈ ఏడాది అక్కినేని కుటుంబం ఇప్పటికే మూడు ఘన విజయాలు అందుకొని మరో విజయం అందుకోవడానికి రెడీ అవుతోంది. ఏడాది ఆరంభంలో సంక్రాంతి సందర్బంగా ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంతో కెరీర్ లో గ్రాండ్ హిట్ అందుకొని 50 కోట్ల మార్క్ చేరుకున్న అక్కినేని నాగార్జున… ఇదే ఏడాది ‘ఊపిరి’ తో మరో గ్రాండ్ హిట్ అందుకున్నాడు. ఇక తండ్రి కి అచ్చొచ్చిన ఈ ఏడాదే చైతూ కి కూడా కలిసొచ్చింది.

  ఈ ఏడాది ‘ప్రేమమ్’ తో రెండు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు సాధించి కెరీర్ లో గ్రాండ్ హిట్ అందుకున్న చైతూ… తన తండ్రి రూట్ లోనే రెండో హిట్ అందుకోవడానికి ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం తో రెడీ అయ్యాడు. ఇప్పటికే ఒక సూపర్ హిట్ అందుకున్న చైతూ ఈ చిత్రం తో కూడా మరో హిట్ అందుకుంటే… ఈ ఏడాది అక్కినేని కుటుంబం ఖాతాలో నాలుగో హిట్ పడ్డట్టే. ఇలా ఒకే ఏడాదిలో 4 విజయాలంటే… అక్కినేని కుటుంబంతో పాటు అక్కినేని అభిమానులకి కూడా 2016 సంవత్సరం కలకాలం గుర్తుండిపోతుంది..