మళ్ళీ వెండి తెర పైకి అక్కినేని ?

Thursday,September 29,2016 - 10:00 by Z_CLU

 అక్కినేని నాగేశ్వరావు ఈ పేరు కు పరిచయం అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమ లో లెజెండ్ గా నిలిచిన ఈ నటుడు మళ్ళీ వెండి తెర పై కనిపించనున్నాడనే  టాక్ వినిపిస్తుంది. అదేంటి మొన్న మధ్యే మరణించిన ఈ మహా నటుడు మళ్ళీ వెండి తెర పై ఎలా కనిపిస్తాడు? అనే సందేహం కలగొచ్చు. అయితే ఈ నటుడ్ని మళ్ళీ వెండి తెరపై చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయట.

 om-namo-venkateshaya-working-still

 ప్రస్తుతం అక్కినేని నాగార్జున రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటిస్తున్న ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రం లో సందర్భం లో ఈ నటుడి ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడట దర్శకేంద్రుడు. ఇక నాగార్జున-రాఘ వేంద్ర రావు కాంబినేషన్ లో ఆ మధ్య వచ్చిన ‘శ్రీరామ దాసు’ చిత్రం గుర్తుంది గా ఆ చిత్రం ఓ ప్రత్యేక పాత్రలో నాగేశ్వరావు తన తనయుడు నాగార్జున తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో కూడా అక్కినేని కనిపిస్తే బాగుంటుందని భావించి ఇందు కోసం గ్రాఫిక్స్ నిపుణుల తో చర్చిస్తున్నాడట. మరి ఆ మధ్య ‘కలిసుందాం రా’ సినిమాతో పాటు ‘యమ దొంగ’ సినిమాలోనూ ఇలా మెరిసాడు ఎన్టీయార్. ఇక తాజాగా కన్నడ సూపర్ స్టార్ విష్ణు వర్ధన్ ను కూడా ‘నాగ భరణం’ చిత్రం ద్వారా ఇలాగే చూపించ బోతున్నాడు దర్శకుడు కోడి రామకృష్ణ. సో ఇప్పుడున్న టెక్నాలజీ తో ఇది సాధ్యమయ్యే పనే కాబట్టి అక్కినేని మళ్ళీ ఇలా ఈ సినిమా లో కనిపించే చాన్స్ ఉంది..