ఎప్పుడూ డిమాండ్ లో ఉండే స్టార్

Monday,March 04,2019 - 11:05 by Z_CLU

సీనియర్ స్టార్ హీరోలంతా ఓవైపు, నాగార్జున మరోవైపు. సాధారణంగా ఓ సినిమా హిట్టయితే ఆ పర్టికులర్ స్టార్ నుండి వచ్చే నెక్స్ట్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతాయి. ఈసారి ఇలా కనిపించాడు.. నెక్స్ట్  ఇంకెలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ రేజ్ అవుతుంది. కానీ నాగ్ విషయంలో అలా కాదు. ఒకసారి ఒక స్టైల్ లో కనిపించి మెస్మరైజ్ చేస్తాడా…? ఫ్యాన్స్ మాత్రం ఆ మాయ నుండి అస్సలు బయటికి రారు. మళ్ళీ అలాంటి మ్యాజిక్ ని  రిపీటెడ్ గా కోరుకుంటూనే ఉంటారు. బహుశా ఇలా ఒక్క నాగ్  విషయంలో జరుగుతుంది. ఎంతమంది యంగ్ హీరోస్ వచ్చినా, అంతెందుకు అక్కినేని న్యూ జెనెరేషన్ ఫామ్ లో ఉన్నా, నాగ్ ప్లేస్ నాగ్ దే.

మన్మధుడు 2 :  ఎప్పుడో 2002 లో రిలీజయింది. ఈ సినిమా తరవాత నాగార్జున ఎన్ని సినిమాలు చేయలేదు…? అయినా ఫ్యాన్స్ మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా ‘మన్మధుడు’ తరహా సినిమా కావాలని డిమాండ్ చేస్తూనే ఉంటారు. నాగ్ కూడా ఇన్నాళ్ళు సరైన   స్క్రిప్ట్ దొరక్క లేట్ చేశాడు కానీ, స్క్రిప్ట్ ఆల్మోస్ట్ ఓకె అయిపొయింది కాబట్టి రేపో మాపో సెట్స్ పైకి వచ్చేస్తున్నాడు నాగ్.


బంగార్రాజు : ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో నిండు పంచెకట్టులో అదరగొట్టేశాడు నాగ్.  అందుకే సినిమా సూపర్ హిట్టయింది. కానీ ఇక్కడ కూడా సీన్ రిపీటయింది. మళ్ళీ నాగ్ ఫ్యాన్స్ నాగ్ ఫ్యాన్సే అనిపించుకున్నారు. ఈ సినిమాలో ‘బంగార్రాజు’ కి అడిక్ట్ అయిపోయిన జనం, నాగ్ చేత ‘బంగార్రాజు’ అనౌన్స్ చేసే దాకా వదిలిపెట్టలేదు. ప్రస్తుతం ఈ సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ ని ఫైనల్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నాడు.

దేవదాస్ : సినిమా సూపర్ హిట్టయింది. మరీ ముఖ్యంగా సినిమాలో నాగ్, నానిల కాంబినేషన్ లో ఉండే సీన్స్ కి ఆడియెన్స్ ఫిదా అయిపోయారు.  అయితే ఈ సినిమాతో ఆగిపోయిందా..? అస్సలు  లేదు.. ఈ సారి నాగ్ నెక్స్ట్ చేయబోయే యంగ్  హీరో ఎవరా అంటూ  ఆల్రెడీ  డిస్కర్షన్స్  స్టార్ట్ అయిపోయాయి.  అందుకే నాగ్ కూడా నెక్స్ట్  మల్టీస్టారర్  కోసం స్క్రిప్ట్స్ వినే ప్రాసెస్ ని బిగిన్ చేసేశాడు.

కరియర్ బిగిన్ అయినప్పటి నుండి గ్యాప్ లేకుండా 100% ఫామ్ లో ఉన్న హీరో నాగ్ ఒక్కడే నేమో. డివోషనల్ సినిమా చేసినా, యాక్షన్ సినిమా చేసినా, ఫ్యామిలీ ఓరియంటెడ్ కథలతో వచ్చినా, రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ చేసినా, నాగ్ ఎన్నిసార్లు ఏ గెటప్ లో   కనిపించినా ఫ్యాన్స్ కి ఏ మాత్రం బోర్ కొట్టదు, తనివి తీరదు.