శభాష్ అల్లుడు అనిపించుకోనున్న నాగచైతన్య...

Monday,July 09,2018 - 12:54 by Z_CLU

మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ రోజే రిలీజయ్యాయి. సోలో పోస్టర్ లో మోస్ట్ స్టైలిష్ గెటప్ లో నాగచైతన్యను ప్రెజెంట్ చేసిన ఫిల్మ్ మేకర్స్, ఇంకో పోస్టర్ లో సినిమా ఎలా ఉండబోతుందో క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమాలో శైలజారెడ్డి గా రమ్యకృష్ణ నటిస్తుంది. అయితే ఈ సినిమా ఎగ్జాక్ట్ స్టోరీలైన్ అయితే ఇప్పటికీ రివీల్ కాలేదు కానీ, అత్తా, అలుళ్ళ మధ్య జరిగే సిచ్యువేషన్స్ ఈ సినిమాలో కీ ఎలిమెంట్స్ కానున్నాయి. దానికి తగ్గట్టుగానే కోపంగా చూస్తున్న రమ్యకృష్ణతో పాటు, నాగచైతన్య, అనూ ఇమ్మాన్యువెల్ ని రివీల్ చేశారు ఫిల్మ్ మేకర్స్.

ఇప్పటి వరకు యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ తో పాటు, యాక్షన్ ప్యాక్డ్ సినిమాల్లో మెస్మరైజ్ చేసిన చైతు, ఇప్పుడీ కొత్త అల్లుడి రోల్ లోను, శభాష్ అనిపించుకోవడం గ్యారంటీ అంటున్నారు ఫిల్మ్ మేకర్స్. దర్శకుడు మారుతి నాగచైతన్యను కంప్లీట్ గా నెవర్ సీన్ బిఫోర్ క్యారెక్టరైజేషన్ లో ప్రెజెంట్ చేయనున్నాడు.

 

ఫాస్ట్ పేజ్ లో సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా యూనిట్, ఈ సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోలేదు. గోపీ సుందర్ మ్యాజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మారుతి ఈ సినిమాకి డైరెక్టర్.