సకుటుంబ సపరివార సమేతంగా..

Saturday,November 05,2016 - 10:00 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో అక్కినేని హీరోల హంగామా కొనసాగుతుంది. వరుస సినిమాలతో వరుస గెస్ట్ రోల్స్ తో…  అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా అలరిస్తూ ముందుకు కొనసాగుతున్నారు. తమ కుటుంబం లో ఏ హీరో సినిమా అయిన అందులో ఓ గెస్ట్ రోల్ లో కనిపిస్తూ అభిమానులను షాక్ చేసి ఆకట్టుకుంటున్నారు. ఈ గెస్ట్ రోల్స్ హంగామా ‘మనం’ చిత్రం నుండి మొదలై తాజాగా ‘నరుడా డోనరుడా’ చిత్రం వరకూ కొనసాగుతూ వచ్చింది. ‘మనం’ క్లైమాక్స్ లో అఖిల్ సడెన్ గా ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చి సినిమాకు హైలైట్ గా నిలిచాడు.

nagarjuna

  ఇక అఖిల్ మొదటి సినిమాలో ఓ పాట లో సడెన్ గా ఎంట్రీ ఇచ్చి ఎట్రాక్ట్ చేశాడు నాగ్. మరో అక్కినేని హీరో సుశాంత్ నటించిన ‘ఆటాడుకుందాం రా’ చిత్రం లో అఖిల్ ఓ పాట లో ఎంట్రీ ఇవ్వగా అదే చిత్రం లో గెస్ట్ రోల్ లో కనిపించాడు నాగ చైతన్య.

sushanth-naga-chaitanya

 ప్రేమమ్  క్లైమాక్స్ లో చైతు తండ్రి గా కనిపించి అందర్నీ సప్రయిజ్ చేశాడు నాగ్. తాజాగా సుమంత్ నటించిన ‘నరుడా డోనరుడా’ చిత్రం లో సినిమా ప్రారంభం ముందు నాగార్జున వీర్యదానం గురించి అవగాహన పెంచుతూ మాట్లాడుతూ కనిపించగా క్లైమాక్స్ లో నాగచైతన్య ఓ గెస్ట్ రోల్ లో ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ఇలా వరుసగా గెస్ట్ రోల్స్ తో అక్కినేని హీరోల ప్రతి సినిమాలోనూ మరో అక్కినేని హీరో హంగామా కనిపిస్తోంది.